Our Street News
ఫార్మసివైద్య ఆరోగ్యం

గంజాయి బదులు టాబ్లెట్ల మత్తు… యువత జీవితాలు నాశనం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో, యువత మత్తు కోసం మెడికల్ షాపుల్లో సులభంగా లభ్యమయ్యే టాబ్లెట్ల వైపు మళ్లుతోంది. ట్రమాడాల్, అల్ప్రజోలం టాపెంటాడాల్, డయాజిపామ్, మిడాజోలామ్, పెంటాజోసిన్, సెట్రిజిన్ (OTC) వంటి మందులు గంజాయికి ప్రత్యామ్నాయంగా మారి, యువకులను తీవ్ర మత్తు లోకి నెట్టివేస్తున్నాయి. సెట్రిజిన్‌ను సాధారణ జలుబు, అలర్జీ మందుగా పరిగణించి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు, కానీ యువత దీన్ని బీర్, బ్రాందీ, విస్కీ వంటి మద్యంలో కలిపి తాగుతూ అధిక మత్తు పొందుతోంది. ఎక్కువ మోతాదులో సెట్రిజిన్ టాబ్లెట్లను జైళ్లలోనూ నేరస్థులు సెట్రిజిన్‌ను మత్తు కోసం దుర్వినియోగం చేస్తున్నట్టు సమాచారం ఉంది. కొన్ని మెడికల్ షాపులు మానసిక వైద్య నిపుణులు, సర్జన్లతో కుమ్మక్కై నకిలీ ప్రిస్క్రిప్షన్లు రాసి ఈ మందులను యువతకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నాయి. ఎంఆర్‌పీ ధరల కంటే నాలుగింతలు అధికంగా అమ్ముతూ డ్రగ్స్ మాఫియా భారీ లాభాలు ఆర్జిస్తోంది. ఫార్మసిస్టులు లేకపోవడం వల్ల ఈ అక్రమ వ్యాపారం మరింత విస్తరిస్తోంది, మరియు గోవా నుంచి గుంటూరుకు టాపెంటాడాల్ టాబ్లెట్లు రూ.3 వేల షీట్ ధరతో దిగుమతి అవుతున్నాయి, వీటిని నీటిలో కరిగించి సిరంజీతో ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. గుంటూరులో రెండు షాపుల లైసెన్సులు సస్పెండ్ అయినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి షాపులు 30 వేల సంఖ్యలో ఉన్నాయని అంచనా.

ఫార్మసిస్టుల సర్టిఫికెట్లను బాడుగకు తీసుకుని మెడికల్ షాపు యజమానులు నకిలీ మందులు, మత్తు కారక పదార్థాలను అడ్డదారుల్లో అమ్ముతున్నారు, అయితే నిజమైన క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు ఉంటే ఇలాంటి నేరాలు జరగనివ్వరని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ 65ను అమలు చేయడంలో ఔషధ నియంత్రణ శాఖ పూర్తిగా విఫలమైంది, దీంతో మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండా అక్రమాలు జరుగుతున్నాయి. సెట్రిజిన్, డయాజిపామ్, అల్ప్రజోలం , అమిత్రిప్తిలిన్, నార్ట్రిప్టిలిన్ వంటి యాంటీ సైకోటిక్ మందులను ఎన్‌డీపీఎస్ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రజల నుంచి బలమైన డిమాండ్ ఉంది. ఈగల్ ఎన్ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ కంట్రోల్ శాఖలు రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేపట్టి, ఫార్మసిస్ట్ లేని షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. యువత జీవితాలు నాశనమవుతుండటంతో డ్రగ్స్ ట్రేడ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, మరియు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్త తనిఖీలు చేపట్టాలని, నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపాలని బలమైన ఒత్తిడి ఉంది. ఇలాంటి అక్రమాలు కొనసాగితే యువత భవిష్యత్తు మరింత అంధకారమవుతుందని సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫార్మ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ సింగనమల సుమన్ మోడీ రాష్ట్ర డిజిపి, ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులకు మరియు ఈగల్ ఇన్ఫోసిమెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయాలకు నిన్న ఫిర్యాదులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Related posts

మసకబారిన ఫార్మసీ వృత్తి విద్యా కోర్సులు

SKG

ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో “దండుపాళ్యం బ్యాచ్”

SKG

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు-2025: ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ ప్రకటించిన 6 గ్యారంటీలు

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్