Our Street News
రాజకీయం

ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో రాయలసీమపై తీవ్ర వివక్ష: ఫార్మసిస్టుల్లో ఆగ్రహం

కడప: ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో రాయలసీమ ప్రాంత ఫార్మసిస్టులపై తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 15 ఏళ్ల తర్వాత 2025 డిసెంబర్‌లో జరగబోతున్న ఈ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో ఆరుగురు ఎన్నికైన సభ్యులు, ఐదుగురు ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులు, ముగ్గురు ఎక్స్-ఆఫీషియో సభ్యులు, ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి ఒకరు, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ సభ్యుడిగా ఉంటూ మొత్తం కౌన్సిల్ ఏర్పడనుంది. ఈ ఆరుగురు ఎన్నికైన సభ్యుల కోసం పలు ఫార్మసీ సంఘాలు 5 నుంచి 6 ప్యానెళ్లుగా ఏర్పాటు చేసి పోటీకి దిగాయి.

అయితే ఈ ప్యానెళ్లలో కేవలం ఒకటి లేదా రెండు తప్ప మిగతావన్నీ రాయలసీమ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్యానెళ్లు ఉమ్మడి రాయలసీమ నుంచి ఒక్కరిని కూడా చేర్చుకోలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో రాయలసీమలోని పలు ఫార్మసీ కళాశాలలకు చెందిన కొందరు పెద్దలు, మేధావులు కూడా రాయలసీమేతర ప్యానెళ్లకు మద్దతు ఇవ్వడం పట్ల సీమ ప్రాంత ఫార్మసిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “రేపు రిజిస్ట్రేషన్, రెన్యూవల్ సమస్యలు వచ్చినప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్లాలి?” అని ప్రశ్నిస్తూ, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోందని మండిపడుతున్నారు. రాయలసీమ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది స్థానికులే ఉంటూ, వారి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ బయటి ప్యానెళ్లకు మద్దతిస్తే వారి పెద్దరికం, గౌరవం ఏమవుతుందని పలువురు ఫార్మసిస్టు సంఘాల నేతలు ప్రశ్నించారు. సొంత ప్రాంతంపై వివక్ష చూపడం సరికాదని, ఈ అంశంపై అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని  ఫార్మసీ  సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Related posts

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

Our Street News

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు: ఫార్మా జేఏసీ మేనిఫెస్టో విడుదల

SKG

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త

Our Street News

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్