Our Street News
విజయవాడ

AP PHARMA JAC – అధికారిక ఎన్నికల మేనిఫెస్టో

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు – 2025

AP PHARMA JAC – అధికారిక ఎన్నికల మేనిఫెస్టో

(ఫార్మసిస్టుల సంక్షేమం – వృత్తి అభివృద్ధే మా ధ్యేయం)

గత 15–16 ఏళ్లుగా ఎన్నికలు లేని ఏపీ ఫార్మసీ కౌన్సిల్, కాలక్రమేణా అక్రమాలకు, అవినీతికి, దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అనర్హులపై అమలు చేయాల్సిన Pharmacy Act Section 42ను తప్పుడు రీతిలో సక్రమంగా నమోదు చేసిన రిజిస్టర్డ్ ఫార్మసిస్టులపై మోపి, వేలాది ఫార్మసిస్టుల రిజిస్ట్రేషన్లు మరియు రెన్యువల్స్‌ను అన్యాయంగా పెండింగ్‌లో పెట్టి, వారి ప్రాక్టీస్ హక్కులను హరిస్తూ వచ్చింది.

దేశంలో ఎక్కడా లేని సమస్యలు కేవలం ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో కుప్పలు తిప్పలుగా పేరుకుపోయి ఫార్మసిస్టులను బాధించాయి.

ఈ అన్యాయాలను పూర్తిగా సరిదిద్దాలంటే: 

✔️ చట్ట పరిజ్ఞానం,

✔️ పరిపాలన దక్షత,

✔️ ఫార్మసిస్టుల సమస్యలపై స్పష్టమైన అవగాహన,

✔️ నిజాయితీ & కర్తవ్య నిష్ఠ,

✔️ గతంలో ఫార్మసిస్టుల కోసం పోరాడిన ధైర్యం, నిబద్ధత, దమ్ము

వన్నీ కలిగిన నాయకత్వం కలిగిన ఏపీ ఫార్మ జేఏసీ తప్ప, ఇంకెవరితోనూ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ప్రక్షాళన అసాధ్యం. ఆ కారణంగా AP PHARMA JAC మీ ముందుకు “లక్ష సాధన – ఆరు హామీలు” అనే చారిత్రాత్మక, ఆచరణ సాధ్యమైన, స్పష్టమైన ఎన్నికల మేనిఫెస్టోతో వస్తోంది.

AP PHARMA JAC – 6 గ్యారంటీలు (విస్తృత వివరణతో)

1. Pharmacy Act Section 42 & 26(A) – చట్టబద్ధ అమలు హామీ:

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ యొక్క తొలి బాధ్యత ఫార్మసిస్టుల ప్రాక్టీస్ హక్కుల రక్షణ. అది మన రాష్ట్రంలో పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు JAC తీసుకునే చర్యలు:

ముఖ్య చర్యలు:

  • Pharmacy Act యొక్క Section 26(A) ప్రకారం Pharmacy Inspectors నియామకం.
  • రిటైల్ ఫార్మసీ, హోల్‌సేల్ & డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో Section 42 కఠినంగా అమలు.
  • అనర్హులు మందులు అమ్మినా, మందులు తయారు చేసినా:
  • Section 42 కింద నేర కేసులు
  • అదనంగా BNS 2023 ప్రకారం క్రిమినల్ చీటింగ్ కేసులు
  • గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్షకు దారి తీసే చర్యలు.

ఫలితం:

✔️ ఫార్మసిస్టులకు పెద్దఎత్తున ఉద్యోగాలు

✔️ అనర్హులు దళారుల రాజ్యం పూర్తిగా ముగింపు

✔️ ఫార్మసీ వృత్తి ప్రతిష్ట పెంపు

 

2. రిజిస్ట్రేషన్ & రెన్యువల్ ప్రక్రియలలో సమూల మార్పులు:

ఫార్మసిస్టుల జీవితంలో అత్యంత కష్టమైన అంశం రిజిస్ట్రేషన్లు & రెన్యువల్స్. AP PHARMA JAC దీన్ని పూర్తిగా మార్చడానికి పెద్ద ఎత్తున నూతన సంస్కరణలు తీసుకొస్తోంది.

ప్రధాన సంస్కరణలు:

  • రెన్యువల్ దరఖాస్తు సమర్పించిన 72 గంటల్లో పూర్తిచేసే విధానం
  • Affidavit పూర్తిగా రద్దు చేసి, దీని స్థానంలో Pharmacist Undertaking Letter ప్రవేశపెట్టడం. (₹350 నుండి ₹500/ఎ వరకూ ఫార్మసిస్ట్ పై అదనపు ఆర్థిక భారం తగ్గిస్తాం)
  • రెన్యువల్ సర్టిఫికేట్‌ కూడా సాఫ్ట్ కాపీ తో పాటు హార్డ్ కాపీ కూడా అందించేలా చర్యలు.
  • కౌన్సిల్ కార్యాలయంలోనే ₹10/- పోస్టల్ కవర్లు – బయట తీస్తా వేసుకుని కూర్చున్న దళారి వ్యవస్థ పూర్తిగా నిర్మూలన
  • ప్రతి ఫార్మసిస్టుకు ID Card జారీ
  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెనుక Drug Inspector Endorsement పూర్తిగా రద్దు.
  • రీన్యువల్ ఆలస్య రుసుము: ₹500 నుండి ₹250 కు తగ్గింపు.
  • APPC – APDCA ఆన్లైన్ డేటాబేస్ అనుసంధానం – రెన్యువల్ ప్రక్రియ సులభతరం.
  • ఫార్మసిస్టుల ఆధార్ లింక్ – నకిలీ రిజిస్ట్రేషన్ల నిర్మూలన

ఫలితం:

  • ✔️ అవినీతి నిర్మూలన
  • ✔️ వేగవంతమైన & పారదర్శకమైన రీన్యువల్
  • ✔️ ఫార్మసిస్టులకు సౌకర్యం, సమయం & డబ్బు ఆదా

3. ఫార్మా.డి డాక్టర్లకు ప్రత్యేక సంస్కరణలు:

  • ఫార్మా.డి డాక్టర్లకు ఏపీ ప్రభుత్వంలోని విధానాలు ఇప్పటికీ అనిశ్చితంగా ఉన్నాయి. JAC దీన్ని పూర్తిగా మార్చేలా పనిచేస్తుంది.

కీలక హామీలు:

  • రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి 50 పడకలకు 1 క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టు భర్తీ అయ్యేవరకు ప్రభుత్వానికి నిరంతర సిఫార్సులు
  • రాష్ట్ర ప్రజలకు క్లినికల్ ఫార్మసీ ఆరోగ్య సేవలు అత్యంత చేరువకు తీసుకురావడానికి Community Drug Information Centres and Community Pharmaceutical Care Centres ఏర్పాటు చేసుకునే విధాన పరమైన Pharm. D డాక్టర్లకు విధానపరమైన సంస్కరణలు తీసుకొచ్చి స్వయం ఉపాధి అవకాశాల కల్పిస్తాం.
  • సరైన క్వాలిఫైడ్ వైద్యం లేక ఇబ్బందులు పడే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రైమరీ వైద్యం తో పాటుగా, క్లినికల్ ఫార్మసీ ఆరోగ్య సేవలు అందించేందుకు Limited Prescription Rights కల్పించి ఫార్మా.డి డాక్టర్లకు గ్రామీణ ప్రాంతాలలో / పట్టణ ప్రాంతాలలోని మురికివాడలలో స్వయం ఉపాధి అందించే నూతన సంస్కరణలు.

ఫలితం:

✔️ ఫార్మా.డి డాక్టర్లకు ఉద్యోగాలు

✔️ గ్రామీణ ఆరోగ్య సేవల బలోపేతం

✔️ క్లినికల్ ఫార్మసీ వృత్తి అభివృద్ధి

 

4. Two-Places Working సమస్యకు శాశ్వత పరిష్కారం: 

  • సెక్షన్ 42 ఉల్లంఘన అంటూ తప్పుడు ఆరోపణలు బనాయించి ఏళ్ల తరబడి వేలాది ఫార్మసిస్టుల రీన్యువల్స్‌ను అన్యాయంగా పెండింగ్‌లో పెట్టిన ఈ సమస్యకు AP PHARMA JAC ఇస్తున్న చారిత్రాత్మక హామీ.
  • మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లోనే అన్ని పెండింగ్ రెన్యువల్ కేసులను ఒక్కసారి లోనే రీన్యువల్ పూర్తి. అదికూడా ఎటువంటి పెనాల్టీలు లేకుండా – ఒక్క రూపాయి కూడా వసూలు కాదు అని హామీ.
  • అన్ని గత sec 36 ఉల్లంఘనల నేర ఆరోపణలను ఫస్ట్ టైం మిస్టేక్‌గా పరిగణించి క్షమాపన మంజూరు రీన్యువల్ దరఖాస్తులకు వెంటనే ఆమోదం

(ఈ హామీ నెరవేర్చే దమ్ము కేవలం ఏపీ ఫార్మా జెఎసి పానల్ సభ్యులకే ఉంది అని ఫార్మసిస్టులు గుర్తించగలరు)

ఫలితం:

✔️ వేలాది ఫార్మసిస్టులకి వెంటనే న్యాయం

✔️ సంవత్సరాల అన్యాయం ముగింపు

✔️ వృత్తి భద్రత పునరుద్ధరణ

 

5. ఫార్మసిస్టుల గౌరవం – భద్రత – సంక్షేమ హామీ:

భద్రత & మారణానంతర సహాయం: ఆకస్మిక/అకాల మరణం చెందిన రిజిస్టర్డ్ ఫార్మసిస్టు కుటుంబానికి ₹10,00,000 ఆర్థిక బీమా సహాయం

కౌన్సిల్ పారదర్శకత:

  • కౌన్సిల్ సిబ్బంది ప్రవర్తనపై Feedback Form
  • కార్యాలయంలో Locked Complaint Box
  • ఫిర్యాదుల కొరకు కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్లో Online Grievance Form (సత్వర పరిష్కారం)

ఫలితం:

✔️ ఫార్మసిస్టుల గౌరవం పెరిగే వ్యవస్థ

✔️ కుటుంబాలకు సామాజిక భరోసా

✔️ కౌన్సిల్‌లో బాధ్యతాయుతమైన వ్యవహార ధోరణి

 

6. ఫార్మసిస్టులకు సబ్సిడీ రుణాలు & కనీస వేతన హామీ: 

  • స్వయం ఉపాధి ప్రోత్సాహం: సొంత మెడికల్ షాపులు స్థాపించుకునేందుకు ₹8 లక్షల వరకు సబ్సిడీ లోన్లు (కౌన్సిల్ స్యూరిటీతో)
  • ప్రైవేట్ ఫార్మసీ ఉద్యోగులకు: కనీస వేతనం ₹15,000. అనుభవం ఆధారంగా వేతన పెంపుకు స్పష్టమైన పాలసీ

ఫలితం:

✔️ యువ ఫార్మసిస్టులకు స్వయం ఉపాధి అవకాశాలు

✔️ ఉద్యోగ భద్రత & న్యాయమైన వేతనం

✔️ వృత్తి స్థిరత్వం పెరుగుదల

 

అంతిమ లక్ష్యం: 

AP PHARMA JAC యొక్క లక్ష్యాలు : 

  • ఫార్మసిస్టుల ప్రాక్టీస్ హక్కుల రక్షణ
  • వృత్తి గౌరవ స్థాపన
  • కౌన్సిల్‌ను పారదర్శకంగా – చట్టబద్ధంగా – బాధ్యతాయుతంగా నడపడం
  • ఫార్మసిస్టుల వృత్తి భవిష్యత్తును బలపరచడం

ఫార్మసిస్టు సోదరులారా మరియు సోదరీమణులారా !

ఇవన్నీ సాధించే శక్తి, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత కలిగిన  ఏకైక ప్యానెల్ AP PHARMA JAC. ఫార్మసిస్టుల కోసం, వృత్తి కోసం, భవిష్యత్తు కోసం AP PHARMA JAC ప్యానెల్‌ను అఖండ మెజారిటీతో గెలిపించండి!

 

 

 

Related posts

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు జేఏసీ సంసిద్ధం

SKG

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు-2025: ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ ప్రకటించిన 6 గ్యారంటీలు

SKG

ఫార్మా డీ కోర్సు ఫీజు 25 నుండి 30 లక్షలు కాగా ఉద్యోగాలు మాత్రం శూన్యం

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్