Our Street News
విజయవాడ

ఏపీ ఫార్మసిక్ కౌన్సిల్ ఎన్నికలు – భారీ కుట్ర

విజయవాడ: గత  వారం రోజులుగా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో, AP PHARMA JAC పేరుతో పాటు URPF (United Registered Pharmacists Front) మరియు “United Pharma JAC” పేర్లను ఉపయోగిస్తూ ఫార్మసిస్టులను అమాయకులుగా చేసి తప్పుదారి పట్టించే పోస్టులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, AP PHARMA JAC ఒక స్పష్టీకరణను విడుదల చేసింది. AP PHARMA JAC కి URPF, United Pharma JAC లేదా United Registered Pharmacists Front వంటి ఏ సంస్థలతో ఎటువంటి సంబంధం లేదని, వీటి సంస్థాగత స్థాయి గురించి కూడా తమకు తెలియదని తెలిపింది. జేఏసీ నిర్వహించిన అంతర్గత విచారణలో, AP PHARMA JAC సభ్యత్వం కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ సంఘాలతో కలిసి, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అస్థిరత సృష్టించే ఉద్దేశంతో, AP PHARMA JAC పేరును సోషల్ మీడియాలో వక్రీకరించి, ఫార్మాసిస్టులను తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్నినట్లు బయటపడింది. అమాయక ఫార్మాసిస్టుల ఓట్లను AP PHARMA JAC పేరుతో దండుకుని, కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ సంఘాలకు మళ్లించే ప్రయత్నం చేసినట్లు జేఏసీ తెలిపింది. ఈ కుట్రలో ప్రమేయం ఉన్నవారిపై ఆధారాలు సేకరించి, భారతీయ న్యాయ సంహిత 2023 (BNS) సెక్షన్లు 318, 336, 341, 342, 353 ప్రకారం క్రిమినల్ చర్యలు ప్రారంభించడమే కాక, సివిల్ దావా కూడా దాఖలు చేయనుందని తెలిపింది. అంతేకాదు, చట్టపరంగా ఎటువంటి సంస్థాగత స్థాయి లేని “United Pharma JAC” తో చేతులు కలిపామని ఒక రిజిస్టర్డ్ ఫార్మసీ సంఘం ప్రకటించడం కూడా ఇదే కుట్రలో భాగమని భావించి, ఆ సంఘంపై రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేయనున్నట్లు, క్రిమినల్ చర్యలలో బాధ్యులను చేయనున్నట్లు AP PHARMA JAC వెల్లడించింది. సోషల్ మీడియాలో AP PHARMA JAC పేరుతో వస్తున్న URPF, United Pharma JAC వంటి తప్పుదారి పట్టించే ప్రకటనలను నమ్మొద్దని, కేవలం అధికారికంగా AP PHARMA JAC విడుదల చేసిన ప్రకటనలనే నిజమైనవిగా పరిగణించాలని ఫార్మాసిస్టులకు ఏపీ ఫార్మ జేఏసీ విజ్ఞప్తి చేసింది.


Related posts

AP PHARMA JAC – అధికారిక ఎన్నికల మేనిఫెస్టో

SKG

ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో “దండుపాళ్యం బ్యాచ్”

SKG

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు-2025: ఏపీ ఫార్మా జేఏసీ ప్యానెల్ ప్రకటించిన 6 గ్యారంటీలు

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్