విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ (APPC) ఎన్నికలు 2025కు 16 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసిస్టుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ఫార్మా జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త డా. సింగనామల సుమన్ మోడీ కీలక ప్రకటన విడుదల చేస్తూ, ఈ ఎన్నిక ఫార్మసి వృత్తిని బ్రతికించుకునేందుకు, వృత్తిపర హక్కులను కాపాడుకునేందుకు చేసే పోరాటమని, అందరూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఈసారి ఒకే ప్యానెల్‌తో పోటీ చేస్తుందని, వేరే ప్యానెల్‌లు లేదా స్వతంత్ర అభ్యర్థులు నిలబెడితే ఓటు చీలి మెడికల్ షాపుల యజమాన సంఘం కు లాభమవుతుందని హెచ్చరిస్తూ, సభ్య సంఘాలు తప్పనిసరిగా జేఏసీ ప్యానెల్‌కే ఫార్మసిస్టులు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రతి సభ్య సంఘం నుంచి ఇద్దరు అర్హులైన అభ్యర్థుల పేర్లు పంపాలని సూచించింది. జేఏసీ ప్యానెల్‌లో SC/ST, BC, మైనారిటీ, ఓపెన్ కేటగిరీ, సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ ఫార్మసిస్టు, అకడమిక్ సెక్టార్ నుంచి తలా ఒకరు ఉండాలని, ఒక మహిళా అభ్యర్థి ఉండేలా చూడాలి అని. అలాగే జోన్‌ల వారీగా నాలుగు ప్రాతినిధ్య సీట్లు కేటాయించగా, ఫార్మ డి డాక్టర్ల సంఘాలకు మరియు అకడమిక్ సీట్లకు జోన్ రూల్ వర్తించదు. మొత్తానికి చూస్తే జేఏసీ ప్యానల్ సభ్యుల్లో సామాజిక న్యాయం, జెండర్ ఈక్వాలిటీ, ప్రాంతీయ ప్రాధాన్యం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జాక్ విడుదల చేసిన ఎలక్షన్ కండక్ట్ మరియు డిసిప్లిన్ కోడ్–2025 ప్రకారం, జేఏసీ సభ్య సంఘం నుండి జేఏసీ కి ప్రతిపాదించిన సభ్యులు జేఏసీ ప్యానెల్‌ను విరుద్ధంగా వేరే ప్యానెల్‌కు మద్దతు ఇచ్చినా, ప్రత్యేక ప్యానెల్ సభ్యులుగా పోటీ చేసినా సంఘాల సభ్యత్వం రద్దు చేయబడుతుందని, తిరుగుబాటు చేసిన వ్యక్తులను వెంటనే సస్పెండ్ చేయాలని, Super Six హామీలు, జేఏసీ వెబ్సైట్ మరియు సోషల్ మీడియా కంటెంట్ కు కాపీరైట్ చట్టం కూడా వర్తిస్తుంది అని హెచ్చరించింది. కొత్త సంఘాలను కూడా అవసరమైతే సభ్యత్వంలో చేర్చుకోవచ్చని జాక్ తెలిపింది. ఫార్మసీ వృత్తి పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో అందరూ ఒక్కటై జేఏసీ ప్యానెల్‌ను విజయవంతం చేయాలని డా. సుమన్ మోడీ రాష్ట్ర ఫార్మసిస్టులకు పిలుపునిచ్చారు.

