Our Street News
విజయవాడ

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల వేళ ఏపీ లో ఫార్మసిస్టుల ఐక్యత తేటతెల్లం

విజయవాడ: ఏపీలో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కు ఎన్నికల నగరా మోగించి, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోటానికి ఒక వైపు కెమిస్ట్ మరియు డ్రగ్గిస్టులు అనే పేరుతో ప్రైవేటు మెడికల్ షాపుల యజమానుల సంఘం, మరో వైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన క్వాలిఫైడ్ ఫార్మసిస్టుల సంఘాలు పోటీ పడుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఫార్మసిస్టు సంఘాలు ఐక్యంగా 2023 లో 9 ఫార్మసీ సంఘాలతో ఏపీ ఫార్మ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వృత్తి సంక్షేమం కోసం కొంతమంది జేఏసీ నాయకులు ఎన్నో పోరాటాలు చేయగా, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల నగర మోగేసరికి, మరికొంతమంది స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో అధికారం కోసం, జేఏసీ విధి విధానాలను తుంగలో తొక్కి, అధికారం కోసం జేఏసీలో సభ్యత్వం లేని సంఘాలకు చెందిన వ్యక్తులను ఏపీ ఫార్మా జేఏసీ అనధికార ప్యానెల్ లోకి ఎలక్షన్ పోటీదారులుగా తీసుకురావడానికి జేఏసీ సభ్యులను అంటూ కొంతమంది ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తుండగా, జేఏసీ ముఖ్య నాయకులు ఎందుకో మౌనంగా ఉన్నారు మౌనంగా ఉన్నారు. ఒకవేళ జేఏసీ ముఖ్య నాయకులు ఈ విధానానికి అడ్డుచెబితే, యునైటెడ్ ఫ్రంట్ అంటూ మరొక ప్యానల్ పెట్టి పోటీ చేయటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి, పైకి మాత్రం   ఐక్యంగా ఒకే ప్యానల్ పెట్టి పోటీ చేసి ఫార్మసిస్టులను గెలిపించుకుంటామంటూ సోషల్ మీడియాలో కొంతమంది మాత్రం ఐక్యం ఐక్యం అంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఒకవైపు ఇస్తూనే మరోవైపు మాత్రం ఈ తొమ్మిది సంఘాలతో పాటు మరో మూడు సంఘాలను కలుపుకుని ప్రతి సంఘం నుండి ప్రత్యేక ప్యానల్ ఏర్పాటు చేయడానికి సరిపడా అభ్యర్థులతో కొంతమంది నామినేషన్లు వేయించడం చూస్తూ ఉంటే, ఫార్మసీ సంఘాలు తమ తమ కళ్ళు తామే పోడుచుకుంతున్నట్టు, ప్రతి ఫార్మసీ సంఘం మనల్ని ఎవరూ గమనించడం లేదు లే అంటూ కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లిలా ముందుకు పదుల సంఖ్యలో అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తూ పోతున్నారనీ, ఇదే కొనసాగితే ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అధికారిక సభ్యత్వ స్థానాలను మెడికల్ షాపుల యాజమాన్య సంఘం అయిన “కెమిస్టు మరియు డ్రగ్గిస్టులు”  దక్కించుకునేలాగా కనిపిస్తోందని, కొంతమంది ఫార్మసీ సంఘాల నాయకుల అధికార దాహంతో నాడు తెలంగాణలో జరిగినట్టుగానే, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పునరావృతం అవుతుందని గత తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల సరళిని విశ్లేషించిన తెలంగాణ ఫార్మసీ సంఘాల నాయకులు కొందరు ఏపీ ఫార్మసిస్టుల సంఘాలను హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా నవంబర్ 19వ తేధీ తరువాత ఎన్ని ప్యానెల్లు పోటీ చేస్తున్నాయి అనే స్పష్టత రానున్నది.

Related posts

ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో “దండుపాళ్యం బ్యాచ్”

SKG

ఏపీ ఫార్మసిక్ కౌన్సిల్ ఎన్నికలు – భారీ కుట్ర

SKG

ఫార్మా డీ కోర్సు ఫీజు 25 నుండి 30 లక్షలు కాగా ఉద్యోగాలు మాత్రం శూన్యం

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్