18 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పోస్టు లేదు… 90% మంది రోడ్డున పడ్డారు
ఆంధ్రప్రదేశ్‌లో ‘డాక్టర్’ పేరుతో ఏటా రూ.2.5 లక్షల ఫీజు… క్లినికల్ ఫార్మసీ ఉద్యోగాలు మాత్రం శూన్యం. ఇతర ఉద్యోగాల్లో చేరితే జీతం రూ.18 వేలు కూడా రాదు
అమరావతి | విజయవాడ | నవంబరు 7, 2025:
“నీట్ రాలేదు కదా… ఫార్మా. డీ చేరు, డాక్టర్ అవుతావు” – ఈ మాటలతో 2010 నుంచి లక్షలాది బైపీసీ విద్యార్థులను కాలేజీలు ఆకర్షిస్తున్నాయి. కానీ 2025 నాటికి ఆ “డాక్టర్” టైటిల్ కేవలం సర్టిఫికేట్‌లోనే మిగిలింది.
ఆస్పత్రి గేటు దాటితే “మీరు మందులు రాయొచ్చా?” అని ఎంబీబీఎస్ వైద్యులు నవ్వుతారు. ఫార్మా కంపెనీలు గిఫ్ట్ బ్యాగ్‌లతో ఎంబీబీఎస్ డాక్టర్ల చుట్టూ తిరుగుతాయి… కానీ ఫార్మా డీ డాక్టర్ ను చూడనూ లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఫార్మా డాక్టర్లకు ప్రెస్క్రిప్షన్ రాసే అధికారం ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు.
6 ఏళ్ల కోర్సు… 18 ఏళ్ల నిరాశ:
2008లో ఫార్మా డీని ప్రవేశపెట్టిన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) హామీ: “అమెరికా లాగా ఇక్కడా ఫార్మాసిస్టులు ప్రిస్క్రిప్షన్ రివ్యూ చేస్తారు, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లు వస్తాయి.”
2025 నాటికి:
కేంద్రం లేదా 28 రాష్ట్రాల్లో ఒక్క ఫార్మా డాక్టర్ పోస్టు కూడా భర్తీ కాలేదు.
ఏపీలో 42 ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్లినికల్ ఫార్మసీ విభాగం జీరో.
ఏటా 1.20 లక్షల మంది ఫార్మా డీ సీట్లు… 1.08 లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్డున పడ్డారు.
ఖర్చు vs ఆదాయం: తల్లిదండ్రుల లెక్క:
మేనేజ్‌మెంట్ కోటా: ఏటా రూ.1.80 లక్షలు – రూ.2.50 లక్షలు
6 ఏళ్ల టోటల్: రూ.25–30 లక్షలు (హాస్టల్, బుక్స్, ఇంటర్న్‌షిప్ స్టైఫండ్ జీరో)
ఉద్యోగం వచ్చినా: ఫార్మకోవిజిలెన్స్ లేదా మెడికల్ కోడింగ్ → రూ.15,000–22,000 (టేక్ హోమ్)
అదే రూ.30 లక్షలను 2% వడ్డీకి FD చేస్తే: నెలకు రూ.30,000 గ్యారంటీ పెన్షన్.
“చదివి డాక్టర్ అయినా… జీతం బస్సు కండక్టర్ కంటే తక్కువ” అని విజయవాడకు చెందిన డా. నాయక్ ఆవేదన. ఆయన కూతురు 2023 బ్యాచ్ ఫార్మా డీ గ్రాడ్యుయేట్… ఇప్పుడు BPOలో నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తోంది.
విదేశాల్లో గౌరవం… ఇక్కడ అవమానం:
USA: ఫార్మా డీ = 6 ఏళ్ల + NAPLEX లైసెన్స్ → ఏటా $1.3 లక్షల జీతం + ప్రిస్క్రైబ్ హక్కు
భారత్: ఫార్మా డీ = 6 ఏళ్ల + జీరో గుర్తింపు
అమెరికాలో ఒక్క రోజులో 300 ప్రిస్క్రిప్షన్లు రివ్యూ చేసే ఫార్మాసిస్ట్… ఇక్కడ ఒక్క మందు బిల్ కూడా సంతకం చేయలేడు.
ఎంబీబీఎస్ vs ఫార్మా డీ: ఆస్పత్రిలో రియల్ సీన్:
ఎంబీబీఎస్ డాక్టర్: రోగికి 10 మందులు రాస్తే ఫార్మా కంపెనీ నుంచి గిఫ్ట్ వచ్చేస్తుంది.
ఫార్మా డాక్టరు: “వైద్యుడు రాసిన ఈ మందుల వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది” అని చెప్పినా… “నీకు ప్రిస్క్రైబ్ హక్కు లేదు” అని మెడికల్ డాక్టర్లు తోసేస్తారు.
పేరెంట్స్ తమ పిల్లలని ఇప్పుడు ఈ 10 కోర్సులకు మళ్లిస్తున్నారు
1. B.Sc నర్సింగ్ (4 ఏళ్లు) → రూ.45,000–80,000 జీతం
2. BPT ఫిజియోథెరపీ → రూ.35,000+ ప్రైవేట్ క్లినిక్
3. B.Sc మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ → 100% ప్లేస్‌మెంట్
4. B.Sc అనస్థీషియా టెక్ → రూ.40,000+ OT జాబ్స్
5. B.Sc ఆప్టోమెట్రీ → రూ.38,000+ ఐ హాస్పిటల్స్
6. B.Sc MLT → రూ.30,000+ ల్యాబ్ టెక్నీషియన్
7. B.Sc ఆపరేషన్ థియేటర్ టెక్ → రూ.35,000+
8. B.Sc డయాలిసిస్ టెక్ → రూ.32,000+
9. B.Sc కార్డియాక్ టెక్ → రూ.40,000+
10. B.Sc న్యూరో ఫిజియాలజీ → రూ.38,000+
ఈ కోర్సులు 3–4 ఏళ్లలోనే 100% ఉద్యోగం, రూ.10–15 లక్షల టోటల్ ఖర్చు.
విద్యార్థుల గోడు:
“ఇంటర్న్‌షిప్‌లో రోజుకు 12 గంటలు పని… స్టైఫండ్ రూ.3,000, కానీ మాకు ఈ స్టైఫండ్ డబ్బు ఇవ్వరు కాలేజీలే యాజమాన్యాలే నొక్కేస్తారు. ఆస్పత్రి వైద్యులు ‘మందుల లిస్ట్ రాసివ్వు’ అంటారు… కానీ మా పేరు ప్రిస్క్రిప్షన్‌పై రాయొద్దు అంటారు.
– డా. సాయి ప్రియ, ఫార్మా డాక్టర్
ప్రభుత్వం మౌనం… కాలేజీల దందా
నిపుణులు ఏమంటున్నారు?
“సిలబస్ ప్రకారం ఫార్మా డీ విద్యార్థి 6వ ఏట ఒక ఎంబీబీఎస్ ఇంటర్న్ కంటే ఎక్కువ మందుల జ్ఞానం ఉంటుంది. కానీ లా అనుమతించదు. రోగులకు డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఓవర్‌డోస్ ఆపడం, జనరిక్ మందులు సూచించడం… ఈ మూడు హక్కులు ఇస్తే ఫార్మా డీ గోల్డ్ మైన్ అవుతుంది.
– డా. సాయి శ్రీ హర్ష , ఫార్మా.డి ప్రొఫెసర్
ఆయుష్ కోర్సుల కంటే ఎందుకు వెనకడుగు?
బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200+ పోస్టులు
ఫార్మా డీకి జీరో
ఆయుష్ డాక్టర్లు కనీసం ప్రైవేట్ క్లినిక్ పెట్టుకోగలరు… ఫార్మా డీకి ఆ హక్కు కూడా లేదు.
గత 5 ఏళ్లలో ఏం జరిగింది?
2020: కరోనా సమయంలో ఫార్మా డీ విద్యార్థులు డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నడిపారు → ప్రశంసలు
2021: హైకోర్టు ఆర్డర్ → “ఫార్మా డీ గ్రాడ్యుయేట్లకు క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులు” → ఫైల్ మూసివేత
2023: PCI కొత్త రూల్ → ఇకపై ఫార్మా డీ లేకుండా ఎంఫార్మసీ అడ్మిషన్ లేదు → ఫార్మా డీ విద్యార్థులు మళ్లీ రూ.10 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే
2025: ఏపీలో 12 కాలేజీలు మూతపడ్డాయి… 30 వేల సీట్లు ఖాళీ
తల్లిదండ్రుల ఫైనల్ ప్రశ్నలు:
“అవగాహన ఉన్న ఏ తల్లీ తండ్రీ… 30 లక్షలు ఖర్చు పెట్టి నిరుద్యోగం కొనమంటారు?”
మీ చైల్డ్ ఫార్మా డీ చేరబోతున్నారా? అయితే ఈ 7 ప్రశ్నలు అడిగి నిర్ణయం తీసుకోండి:
1. 6 ఏళ్ల తర్వాత ప్రిస్క్రైబ్ హక్కు ఉందా?
2. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టులు ఎన్ని?
3. ఇంటర్న్‌షిప్ స్టైఫండ్ ఎంత?
4. ఫార్మా కంపెనీలు ఫార్మా డీ గ్రాడ్యుయేట్లను ఎందుకు పట్టించుకోవు?
5. ఒకవేళ ఉద్యోగం రాలేదంటే రూ.30 లక్షలు ఏం చేయాలి?
6. అదే డబ్బుతో B.Sc నర్సింగ్ చేస్తే ఎంత జీతం?
7. రేపు మీ పిల్లవాడు “నేను డాక్టర్” అని చెప్పగలడా?
తదుపరి కథనం (నవంబరు 8):
“ఫార్మా డీ vs పారా మెడికల్: రూ.10 లక్షల్లో 100% జాబ్ గ్యారంటీ ఉన్న 15 కోర్సులు – ఫీజు, కాలేజీలు, ప్లేస్‌మెంట్స్ ఫుల్ లిస్ట్”

