Our Street విశ్లేషణ:
నెల్లూరు: జిల్లాలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అర్థం అవుతోంది. పార్టీ ఏర్పాటు నుంచి నియోజకవర్గస్థాయిలో ఎంతో కష్టపడిన నాయకులు, ఎన్నికల తర్వాత కూటమిగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, పార్టీ కోసం కష్టపడ్డాము అంటూ పదవులు ఆశించి పార్టీ అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక టిడిపి ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడతారేమో అని, పైగా పదవులు ఇస్తే కొరకరాని కొయ్యలా తయారవుతారని ముందస్తు జాగ్రత్తగా పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని కరివేపాకుల తీసి పక్కన పడేయడానికి జిల్లా స్థాయిలో ఒక నాయకుడిని నియమించి ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీని రెండుగా చీల్చి, ఇదే జనసేన పార్టీలో టిడిపి ఎమ్మెల్యేలకు అనుకూలంగా భజన చేసే మరొక బ్యాచ్ ని మరొక వర్గంగా తయారు చేసి, ఒకే నియోజకవర్గంలో జనసేనలో రెండు వర్గాలను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా సొంత పార్టీలోనే రెండు గ్రూపులను తయారు చేసి వివాదాలు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివాదాలు తారాస్థాయికి చేరి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ జనసేన నాయకులపై మరియు వారికి అనుకూలంగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలపై గొడవలకు దిగడం, టిడిపి ఎమ్మెల్యేల అన్నదండలతో సొంత పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనయించడం, ఈ వివాదాలు చివరికి సొంత పార్టీ కార్యకర్తలను హత్యలు చేసే స్థాయికి వరకు వెళ్లడం జనసేన పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇదే కొనసాగితే జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో భూస్థాపితం అవడం ఖాయం అని సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
Source:


