కడప, అక్టోబర్ 12: రానున్న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనను సభ్యునిగా ఎన్నుకుంటే, న్యాయవాదుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని కడపకు చెందిన ప్రముఖ న్యాయవాది కర్నాటి భువన ఏకాదశి రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఆచరణీయమైన, అమలు చేయదగ్గ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలతో కూడిన మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తానని తెలిపారు.
న్యాయ వృత్తి ఔన్నత్యాన్ని కాపాడుతూ, సమాజంలో న్యాయవాదుల గౌరవాన్ని నిలబెట్టడంతో పాటు, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అతి త్వరలో పటిష్టమైన హామీలతో కూడిన మేనిఫెస్టో ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏపీ బార్ కౌన్సిల్‌ను పారదర్శకంగా నిర్వహించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని ఆయన వెల్లడించారు.

