తిరుపతి: దేశంలో ఫార్మసీ కోర్సులకు రాను రాను ఆదరణ తగ్గిపోతూ వస్తోంది, కారణం మాత్రం ఫార్మసీ చట్టంలోని సెక్షన్ 42 అమలుకాకపోవడం అని నిపుణులు అంటున్నారు. ఈ చట్ట ప్రకారం మందుల తయారీ కంపెనీలలో ఫార్మసీ పట్టభద్రులు మందులు తయారీ చేయాలని, మందుల షాపులలో ఫార్మసీ పట్టభద్రులు మాత్రమే ప్రజలకు మందులు జారీ చేయాలని, అనర్హులు చేస్తే వారిపై కేసులు పెట్టీ జైలుకు పంపాల్సి ఉందని చెబుతుండగా అటు మందుల తయారీ కంపెనీలలో, ఇటు మందుల షాపులలో ఫార్మసిస్టులకు బదులుప్ అనర్హులు మాత్రమే దర్శనం ఇస్తారు, కారణం మాత్రం నిర్వాహకులు జీతాల భారం తగ్గించుకోటానికి ఇలా అనర్హులను తక్కువ జీతాలకి నియమించుకుంటూ వుంటారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా దీన్ని నిరోధించాల్సిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కూరుకుపోయారు. ఫలితంగా డి. ఫార్మసీ, బి. ఫార్మసీ మరియు ఏం ఫార్మసీ కోర్సులు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా లేకుండాపోయాయి అని నిపుణులు అంటున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గిపోగా ఫార్మసీ కళాశాల విద్యా వ్యాపారాన్ని బ్రతికించటానికి కొత్త ఆశలు రేకెత్తించి డాక్టర్ల తర్వాత డాక్టర్లు అంటూ ఫార్మా .డీ అనే ఆరేళ్ల కోర్సును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కోర్సు తీసుకొచ్చి 17 ఏళ్లు గడుస్తున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క క్లినికల్ ఫార్మాసిస్ట్ పోస్టు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో నియామకం చేసిన దాఖలాలు లేవు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫార్మసీ కోర్సులకు పూర్తిగా ఆదరణ తగ్గిపోయిందనీ, గ్రామీణులు, అమాయకులు ఇతర కోర్సులలో సీటు రాక, వేరే ప్రత్యామ్నాయం లేక కొంతంది ఫార్మసీ కోర్సుల్లో చేరుతూ, లక్షలు ఖర్చు చేస్తున్నారనీ, మోస్తరు పేరున్న ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో ఫార్మా.డి కోర్సు పూర్తి చేయాలంటే కనీసం అంటే 15 నుండి 20 లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని, తీరా ఫార్మసీ కోర్సులు చేసి బయటికి వస్తున్న పట్టభద్రులకు కనీసం పదివేలు జీతం వచ్చే పరిస్థితి ఫార్మసీ రంగంలో లేదని ఫార్మసీ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఔషధ నియంత్రణ శాఖ మామూళ్ల మత్తులో నుండి నిద్ర లేచినప్పుడే ఫార్మసీ వృత్తి బాగుపడుతుంది ఏపీ ఫార్మసిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డా. సింగనమల సుమన్ మోడీ తెలిపారు.
next post

