విజయవాడ : ప్రస్తుతం సమాజంలో పెళ్లిళ్లు రెండు సంవత్సరాలు గడవకముందే విడిపోవడం, భార్యభర్తలు పరస్పరంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయల కేసులు వేయడం సాధారణమైపోయింది. పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నా, ఆస్తులు–డబ్బుల కోసం న్యాయపోరాటాలు తప్పనిసరిగా మారాయి. ఈ పరిస్థితుల్లో హిందూ వివాహాన్ని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్వహించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
క్రిస్టియన్, ముస్లిం వివాహాలు చట్టపరంగా ఒక కాంట్రాక్ట్ రూపంలో జరుగుతున్నాయి. కానీ హిందూ వివాహం మాత్రం ఇప్పటికీ మంత్రోచ్ఛరణలతోనే కొనసాగుతుంది. చేసుకున్న ప్రమాణాలు వాస్తవంలో ఎవరూ పాటించకపోవడం వల్ల కుటుంబ జీవనం సంక్షోభంలో పడుతోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకు అవసరం హిందూ మ్యారేజ్ కాంట్రాక్ట్?
పెళ్లిళ్లు విఫలమవుతున్నాయి. విడాకులు తీసుకున్న తరువాత వరుడు, అతని తల్లిదండ్రులు కట్న కేసులు, ఆస్తి కేసులు, మెయింటెనెన్స్ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు.చి న్న పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. సమాజంలో కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ప్రతిపాదిత కాంట్రాక్ట్‌లో ప్రధాన షరతులు:
1. కట్నం లేనిది – పెళ్లిలో ఎటువంటి కట్నం ఇవ్వబడలేదని, వధువుకు ఇచ్చే ఆభరణాలు ఆమె వ్యక్తిగత బహుమతులేనని లిఖితంగా రాయించుకోవాలి.
2. ఆస్తి హక్కులు – వరుడు సంపాదించిన ఆస్తులపై వధువుకు ఏడు సంవత్సరాల నిరంతర దాంపత్య జీవితం పూర్తయిన తరువాతే హక్కు ఉంటుంది.
3. మెయింటెనెన్స్ – ఏడు సంవత్సరాల ముందు విడాకులు వచ్చిన పక్షంలో వధువు ఎటువంటి మెయింటెనెన్స్ లేదా ఆస్తి వాటా కోరరాదు.
4. పిల్లల పెంపకం – పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు వస్తే, వారి చదువు, వైద్యం, జీవన ఖర్చులు భార్యభర్తలు సమానంగా భరించాలి.
5. కుటుంబ జీవనం – పరస్పర గౌరవం, విశ్వాసంతో జీవించాలని, చిన్న చిన్న తగాదాలు మూడవవారికి చెప్పకుండా పరిష్కరించుకోవాలని ఒప్పందంలో పేర్కొనబడుతుంది.
6. చట్టపరమైన రక్షణ – ఈ ఒప్పందం ఇరు పక్షాలకు మరియు వారి వారసులకు చట్టబద్ధం అవుతుంది. భవిష్యత్తులో కట్నం, ఆస్తి లేదా మెయింటెనెన్స్ కేసులు వేయరాదు.
వివాహానికి ముందు వరుడు పాటించాల్సిన జాగ్రత్తలు:
తన పేరుమీద ఉన్న ఆస్తులను తల్లిదండ్రుల పేర్లకు మార్చుకోవాలి.
తోబుట్టువులతో ఆస్తి వివాదాలు రాకుండా ముందుగానే రాసి పెట్టుకోవాలి.
పెళ్లి అయిన వెంటనే కనీసం ఒక సంవత్సరం పిల్లలను కనకపోవడం ఉత్తమం.
విడాకుల సందర్భంలో మెయింటెనెన్స్ మొత్తాన్ని ముందే నిర్ణయించుకోవడం మంచిది.
చట్టపరమైన ప్రక్రియ:
ఈ ఒప్పందం కనీసం రూ.100/- విలువైన స్టాంప్ పేపర్‌పై రాయాలి. నోటరీ/అడ్వకేట్ సమక్షంలో ఇరు పక్షాలు సంతకాలు చేయాలి.
ఫోరం అభిప్రాయం:
“హిందూ వివాహాన్ని కూడా కాంట్రాక్టు పద్ధతిలో జరపకపోతే భవిష్యత్తులో కుటుంబ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. వివాహానికి ముందే ఈ ఒప్పందం చేసుకోవడం ద్వారా వరుడు, వధువు, వారి కుటుంబాలు అనవసరమైన న్యాయపోరాటాల నుండి రక్షించబడతాయి” అని Marriage Disputes Legal Redressal Forum ప్రతినిధులు తెలిపారు.
మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వారు:
Marriage Disputes Legal Redressal Forum
Mobile: 8008633689
Email: MDLRF.CWT@GMAIL.COM
Click on the below 👇 for General Marriage
For SPECIAL AGREEMENT formats contact us

