Our Street News
విజయవాడవైద్య ఆరోగ్యం

ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో “దండుపాళ్యం బ్యాచ్”

వీరి దోపిడి వెనుక వైసీపీ ప్రభుత్వంలో నియామకమై కొనసాగుతున్న రిజిస్ట్రార్ మరియు 5 మంది నామినేటెడ్ సభ్యుల హస్తం ?

కళ్ళు లేని కబోధిలా కూటమి ప్రభుత్వం
ఫార్మసీ సంఘాల నుండి పిర్యాదులు వెల్లువెత్తినా – చర్యలు చెవు
రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా లేనట్టేనా ?

అమరావతి: ఫార్మసిస్టులను భయపెట్టి, బెదిరించి దోపిడి చేయడంలో మరియు విధాన పరమైన అక్రమాలకు పాల్పడటంలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సిబ్బంది ఆరితేరిపోయారని, ఏకంగా దండుపాళ్యం సినిమాలో వారు మానవత్వం మరచి క్రూరంగా గొంతులు కోసి చంపినట్లుగా, వీరు కూడా డబ్బు కోసం ఫార్మసిస్టుల రెన్యువల్ దరఖాస్తులను చిన్న పాటి కారణాలు చూపి కావాలనే రిజెక్ట్ చేయడం, తర్వాత అడిగినంత చెల్లించకుంటే సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరుగుతోంది. ఫలితంగా ఫార్మసిస్టుల ఉద్యోగ – ఉపాధికి గండి కొడుతూ, ఫార్మసిస్టుల కుటుంబాలను రోడ్డుపైకి ఈడుస్తున్నారు.

గత నాలుగైదేళ్ల కాలంలో 15 వేలకు పైగా ఫార్మసిస్టుల సర్టిఫికెట్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం. దీంతో ఫార్మసిస్టులు మానసికంగా మరియు ఆర్థికంగా కుంగిపోతున్నారు, ఉద్యోగం మరియు ఉపాధి కోల్పోయి ఫార్మసిస్టుల కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలోని ఒక అధికారిని నుండి తీసుకొచ్చిన మెమో ముసుగున కొత్త రెన్యువల్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు అడ్డ దారిలో ఒక్కో అభ్యర్థి నుండి రూ. 50000 నుండి 1 లక్ష వరకూ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు, ఈ అవినీతి సొమ్ము 200 కోట్ల రూపాయలు పైబడే ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో రిజెక్ట్ అయిన రెన్యువల్ దరఖాస్తులను కౌన్సిల్ ఆన్లైన్ డేటా బేస్ నుండి తొలగించి, కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి, ఈ మెమో కిందకి తీసుకు వచ్చి, ఫార్మసిస్టులు తమ సర్టిఫికెట్లు మెడికల్ షాప్ ఓనర్లకు బాడుగలకు ఇచ్చినప్పటికీ మెమో రూల్ కిందకి తీస్కొచ్చి ఫార్మసిస్టుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను విజయవంతంగా రెన్యువల్ చేస్తున్నారని, అయితే దీనికోసం దాదాపు లక్ష రూపాయలకు పైగా చెల్లించమని సిబ్బంది బ్రోకర్ల ద్వారా డిమాండ్ చేస్తున్నట్లు ఫార్మసిస్టులు గగ్గోలు పెడుతున్నారు.

ఈ రకమైనటువంటి అక్రమాలు, దోపిడి పర్వం వెనుక కేవలం వైసీపీ ప్రభుత్వంలో నియామకం అయిన రిజిస్ట్రార్ మరియు నామినేటెడ్ సభ్యుల హస్తం ఉందని పలు అనుమానాలు ఉన్నాయని ఫార్మసిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ను గాలికి వదిలేసిందనీ, కౌన్సిల్ అక్రమాలు, అవినీతిపై ఫార్మసీ సంఘాలు ఎన్ని పిర్యాదులు చేసినప్పటికి దున్నపోతు నిద్ర పోయినట్లు, పట్టించుకునే పరిస్థితి లేదు అని ఫార్మసిస్టులు ఆరోపిస్తున్నారు. వారి దోపిడీ పర్వం మరింత పెంచుకోవటానికి ఏకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒక అధికారితో కుమ్మక్కై ఒక ప్రత్యేక మెమో జారీ చేయించి మరీ అందిన కాడికి దోచుకుంటున్నారు అంటే, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నందు జరుగుతున్న అక్రమాల వెనుక ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అండదండలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు ఫార్మసీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నందు జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకే ఫిర్యాదు చేసినట్లు ఏపీ ఫార్మసిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సింగనమల సుమన్ మోడీ తెలిపారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు జేఏసీ సంసిద్ధం

SKG

“లా నేస్తం” నెలకు ₹10,000 ఎక్కడ ?

SKG

మసకబారిన ఫార్మసీ వృత్తి విద్యా కోర్సులు

SKG

Leave a Comment

హోమ్
ఉద్యోగాలు
జాతీయ వార్తలు
పబ్లిష్ పోస్ట్