ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు వీరిరువురి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

