జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ (GHMC Council Meeting) సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి (Mayor Gadwala Vijayalaxmi) అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతామని మేయర్ చెప్పగా.. అందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని రెండు పార్టీల సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు.

