బాపట్ల జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారధి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.

